Buddy
Tuesday, September 13, 2011
Friday, January 7, 2011
Tuesday, December 21, 2010
Thursday, November 25, 2010
నిస్సహాయుడ్ని
నేను
పలికే పదాల్ని
కదిలించాలనుకుంటా
నా మదిలో
చెలరేగే భావాల్ని
చైతన్య కెరటాలుగా మార్చాలనుకుంటా
ఉషస్సును
సంధ్య సమయాన్ని
హృద్యంగా ఆస్వాదించాలనుకుంటా
మారుతున్న విలువల్ని
మానవ మస్తిష్క బంధాల్ని
అక్షర బంధం చేయలనుకుంటా
వడివడిగా సాగుతున్న
జీవన యానంలో
ఒక్క అక్షరాన్ని పదంగా కూర్చలేక
నిస్సహయునిగా మిగిలా




















































